BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 03:19 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
15 Aug, 2026 - 03:19 PM
55 వీక్షణలు
సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ది విశాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్

ఎల్కతుర్తి: మండలంలోని ది విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు, సభ్యులు, నాయకులు, మండల ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం కేవలం కులం, మతం, జాతికి సంబంధించినది కాదని, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అని అన్నారు. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. సహకార సంఘం అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో నష్టాల్లో ఉన్న సంఘాన్ని ప్రస్తుతం లాభాల బాటలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి సభ్యులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గుర్తించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో సహకార సంఘం కమిటీ ఉపాధ్యక్షులు, సభ్యులు, నాయకులు, మండల ఎంపీడీవో తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.