BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 02:47 pm
Posted by : NTODAY NEWS

సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం

తెలంగాణ
/ నల్గొండ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
15 Aug, 2026 - 02:47 PM
300 వీక్షణలు

నల్గొండ, ఆగస్టు 15: NTODAY NEWS 

నల్గొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లోకి పోలీసులు ప్రవేశించి సీపీఎం నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.

సుందరయ్య భవన్‌లో ఉన్న సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సీపీఎం నాయకులు దండంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, బొల్లు రవీందర్ తదితరులపై పోలీసులు దాడి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రాజకీయ పార్టీ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.

పార్టీ కార్యాలయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజా నాయకులపై దాడులకు పాల్పడటం సరికాదని విమర్శించారు.

పోలీసులు ప్రజల పట్ల, ప్రజా నాయకుల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. పోలీసులంటే ప్రజలకు రక్షణగా ఉండాలే తప్ప, పోలీసులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడకూడదని అన్నారు.

సీపీఎం కార్యాలయంలోకి ప్రవేశించి నాయకులపై దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.