BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 02:47 pm
Posted by : NTODAY NEWS

పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
15 Aug, 2026 - 02:47 PM
167 వీక్షణలు

ఆమడగూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఆమడగూరు, ఆగస్టు 15 (ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు):

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమడగూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘనంగా పురస్కారాలు అందజేశారు.

మండలవ్యాప్తంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందించి ప్రోత్సహించారు. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు విద్యపై మరింత ఆసక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

దాతల సహకారంతో కార్యక్రమం

విద్యార్థుల ప్రోత్సాహక కార్యక్రమానికి కె. సుమన్ బాబు (ఫైనాన్షియల్ అడ్వైజర్), సి. మల్లికార్జున (సీనియర్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), మంజునాథ్ బాబు (వైస్ ప్రిన్సిపాల్, ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), నటేష్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), డాక్టర్ సోమశేఖర్ (ఎంబీబీఎస్, ఎండీ), పి. నాగ సుధీర్ శర్మ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), రాగిమాకుల హరినాథ్ (స్కూల్ అసిస్టెంట్) ఆర్థిక సహాయం అందించారు.

దాతల సహకారంతో యూత్ అసోసియేషన్ సభ్యులు ఆయా పాఠశాలలకు వెళ్లి గ్రామ పెద్దలు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమడగూరు యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగార్జున మాట్లాడుతూ.. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో క్రమశిక్షణను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. తమ ప్రతిభతో పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా సేవా గుణాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శులు అశోక్, సులేమాన్, కోశాధికారి శివశంకర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శివశంకర్, రేవన్, మణికంఠ, పల్సర్ పవన్, యశ్వంత్, సింహా, కాలేశ్, కరీముల్లా, బాలాజీ, మనోజ్, గౌతం సాయి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.