BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 28 June 2026, 09:03 am
Posted by : M. రాజశేఖర్

Health: కుప్పంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఘన శ్రీకారం.. చిన్నారులకు పోలియో చుక్కలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
28 Jun, 2026 - 09:03 AM
53 వీక్షణలు

కుప్పం | జూన్ 28 | NTODAY NEWS

కుప్పం నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గంగాదేవి ఘనంగా ప్రారంభించారు. బస్సు స్టాండ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పోలియో నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సుభాష్ రాజా, డాక్టర్ దీప్ కుమార్, డాక్టర్ సాయ్ ప్రదాప్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. ప్రతి చిన్నారికి నిర్ణీత వయస్సులో పోలియో టీకా అందించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వారు తెలిపారు.

కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, కుప్పం మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్న అధికారులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.