BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 05:45 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
25 Sep, 2026 - 05:45 PM
9 వీక్షణలు

కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీనదయాళ్ ఉపాధ్యాయ దేశ సేవను జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రజా జీవితంలో పనిచేశారని తెలిపారు. భారతీయ జనసంఘ్‌ను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.


దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవతావాదం’, ‘అంత్యోదయ’ సిద్ధాంతాలను నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలనేది అంత్యోదయ భావనలో ప్రధాన అంశమని తెలిపారు.


పేదలు, రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సంబంధించిన అంశాలపై కూడా కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. బీసీ వర్గాల సాధికారత కోసం విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ప్రజా జీవితంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, వెంకటేష్, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి, మీడియా జిల్లా ఇన్‌చార్జ్ డీఎల్ ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కే. గిరిజమ్మ, మేకల నాగార్జున, బెల్లాల్ ఉత్తమ రెడ్డి, మైనార్టీ నాయకులు ఇంతియాజ్, మాజీ కౌన్సిలర్ మైనుద్దీన్, ఎర్రంశెట్టి రమేష్ బాబు, ఆలీ, నంది శెట్టి బాబు, శివరెడ్డి, రంగారెడ్డి, రవిచందర్ నాయుడు, ఇబ్రహీం, జనార్ధన్, దేవానంద్ కాలనీ శ్రీనివాసులు, మంజునాథ్ రెడ్డి, ఆవుల శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.