BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 May 2026, 09:34 am
Posted by : BATHULA VENKATESH

ప్రజా సమస్యలపై ఎస్పీ బిందు మాధవ్ సత్వర చర్యల ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 09:34 AM
143 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 49 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మొత్తం 49 ఫిర్యాదులను స్వీకరించారు.

స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 11, కుటుంబ కలహాలకు సంబంధించినవి 19 కాగా, ఇతర విభాగాలకు చెందినవి 19గా గుర్తించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 7 రోజుల లోపు విచారణ పూర్తి చేసి, తగిన పరిష్కారం చూపుతూ పూర్తి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జి. బిందు మాధవ్, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు.

– జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ