BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ప్రజాసేవకుడిపై దాడి క్షమించరాని నేరం..నిందితులను విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 07:41 AM
103 వీక్షణలు

ప్రజాసేవకుడిపై దాడి క్షమించరాని నేరం..నిందితులను విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీమున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిని పరామర్శించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ సత్యవేడు ఇంచార్జ్ రాజేష్

తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ సత్యవేడు ఇంచార్జ్ రాజేష్ వేరువేరుగా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున పూర్తి అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, సత్యవేడు ఇంచార్జి రాజేష్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడే నాయకుడిపై దాడి జరగడం అత్యంత దుర్మార్గమైన చర్య. సమాజంలో భయాందోళనలు సృష్టించే ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు.. కానీ హింసకు ఎప్పటికీ స్థానం లేదని, రాజకీయ కక్షలు, వ్యక్తిగత ద్వేషాలతో దాడులకు పాల్పడటం మంచిది కాదన్నారు. దాడి వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దశరథరామిరెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఆయనకు వైయస్ఆర్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.