పూర్తి కావస్తున్న పటేల్ కుంట రోడ్డు పనులు
తెలంగాణ
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఊరుమడ్ల | సెప్టెంబర్ 23: ఊరుమడ్ల గ్రామంలోని పటేల్ కుంట కట్టకు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ పనులు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.
పనుల్లో భాగంగా బుధవారం రోడ్డు నిర్మాణానికి కంకర పరిచి చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు పనులు పూర్తయితే పటేల్ కుంట పరిసర ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు స్థానిక రైతులకు ప్రయోజనం కలుగుతుందని గ్రామస్తులు, రైతులు పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులు పూర్తికావస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులకు నిధులు మంజూరు చేయడంలో సహకరించిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.