BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 02 July 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:49 PM
119 వీక్షణలు

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పారని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు 40 వేల గోకులాలు, 15,500 నీటితొట్టెల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి కొత్త దిశ చూపారని కొనియాడారు.

గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో పవన్ కళ్యాణ్ కృషి ప్రశంసనీయమని, ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చంద్రబాబు అన్నారు.