BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:46 pm
Posted by : MUSUGU GOPI

బ్లో అవుట్ ఘటనపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
18 Nov, 2026 - 05:46 PM
24 వీక్షణలు

ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం

వరుస గ్యాస్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఓఎన్జీసీ భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్‌కు ఆదేశాలు

కోనసీమ జిల్లా: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఘటన తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రతపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా సమీప జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు వెల్లడించారు.

ఓఎన్జీసీ సాంకేతిక బృందం ఇప్పటికే బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.