BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 October 2026, 09:57 pm
Posted by : M. రాజశేఖర్

PCPNDT చట్టాన్ని తప్పక పాటించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
05 Oct, 2026 - 09:57 PM
3 వీక్షణలు

కుప్పం: కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు PCPNDT చట్టం నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని PCPNDT సబ్‌-డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీ హెచ్చరించింది.

చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ కేంద్రాలు, PMP, RMP ప్రాక్టీషనర్లపై ఇకపై ఉపేక్షించేది లేదని కమిటీ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో వైద్య సేవల నిర్వహణలో PCPNDT చట్టాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కమిటీ సూచించింది. ముఖ్యంగా స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, రికార్డుల నమోదు, నిబంధనల అమలు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని పేర్కొంది.

చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదా PCPNDT చట్ట నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది.

ఈ మేరకు కుప్పం రెవెన్యూ డివిజనల్ అధికారి, PCPNDT సబ్‌-డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీ చైర్‌పర్సన్, కమిటీ మెంబర్ కన్వీనర్, కుప్పం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కమిటీ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు.