BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఏకగ్రీవమైన ఏకైక జడ్పీటీసీ స్థానం పెదవేగి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 07:40 PM
46 వీక్షణలు

ఏలూరు జిల్లా టీడీపీ ఖాతాలో అరుదైన ఘనత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ ఏకగ్రీవ ఎన్నిక ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఏలూరు జిల్లా పెదవేగి మండలం ప్రత్యేక గుర్తింపు సాధించింది. పెదవేగి జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఎన్నికల పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో పెదవేగి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు పరిశీలిస్తే పెదవేగి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన ఏకైక స్థానంగా నిలిచిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం ఏలూరు జిల్లా కూటమి శ్రేణుల్లో, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. సాయి నవ్యశ్రీ ఏకగ్రీవ ఎన్నికతో పెదవేగి మండలంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నాయకుల మధ్య సమన్వయం, స్థానిక రాజకీయ పరిణామాలు ఈ ఫలితానికి దోహదపడ్డాయని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాయకత్వానికి ఈ పరిణామం నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. పెదవేగి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడం ఏలూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.