BREAKING
thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు
Date of Publish : 05 October 2026, 07:16 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చోడవరంలో ఘనంగా పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
05 Oct, 2026 - 07:16 PM
3 వీక్షణలు

కొండపి: కొండపి మండలం చోడవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీడీపీఓ సుశీల దేవి, సూపర్‌వైజర్ విక్టోరియా రాణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. పోషకాహారం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని సూచించారు.

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు స్థానికంగా లభించే పోషకాహార పదార్థాల వినియోగం, వాటి ప్రయోజనాలు, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై తల్లులకు అవగాహన కల్పించారు. పోషకాహారంపై చైతన్యం పెంచేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు హేమలత, మమత, మండల బీజేపీ నాయకుడు బ్రహ్మయ్య, గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.