BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సచివాలయం వద్ద ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 08:10 PM
15 వీక్షణలు

పీసీపల్లి: ఒకటిన్నర సంవత్సరంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీసీపల్లి మండలం పెద్ద ఇర్లపాడు ఎస్సీ కాలనీ ప్రజల తరఫున నాయకులు ధర్నా చేపట్టారు. పీసీపల్లి వైఎస్సార్ జడ్పీటీసీ పెద్దిరెడ్డి ఓబుల్ కొండారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఇర్లపాడు సచివాలయం వద్ద నిరసన నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏడాది కాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. వేసవితో పాటు ఇతర కాలాల్లోనూ తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ప్రజలకు తాగునీరు అందించడం అధికారుల బాధ్యత అని, సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకుని ఎస్సీ కాలనీకి నిరంతర తాగునీటి సరఫరా అందించాలని కోరారు.

తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.