BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:21 pm
Posted by : K MAHESH

వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:21 PM
7 వీక్షణలు

ప్రజల నుంచి రెండు ఫిర్యాదుల స్వీకరణ.. ఐదు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

వలిగొండ, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం రెండు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యాలయానికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసేందుకు ప్రజావాణి కార్యక్రమం వేదికగా నిలిచింది. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఐదు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఎంపీడీవో జి. జలందర్ రెడ్డి మండలంలోని అక్కంపల్లి, ఎడుల్లగూడెం, ప్రొద్దటూరు, టేకులసోమారం, దాసిరెడ్డిగూడెం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ దశలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన కొలతలు, నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా ఇళ్లను పూర్తి చేసుకోవాలని ప్రోత్సహించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత కొలతల ప్రకారం, నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు సహకరించాలని ఎంపీడీవో సూచించారు.