ప్రజా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
ప్రజా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: ప్రజల నుంచి స్వీకరిస్తున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు.
మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తున్నందున వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి అర్జీ పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా శాఖల వారీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.