BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెద్దపల్లిలో ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్..

తెలంగాణ
/ పెద్దపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 02:34 PM
37 వీక్షణలు

రూ.1.50 లక్షల లంచం వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్!    కేసులో అనుకూలంగా వ్యవహరిస్తామంటూ డబ్బుల 

డిమాండ్.. రూ.10 వేల నగదు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

పెద్దపల్లి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో ప్రభుత్వ న్యాయాధికారి చిక్కుకున్నారు. పెద్దపల్లి ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టులో టెన్యూర్ ప్రాతిపదికన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న డొంకెన రవీందర్‌తో పాటు, ప్రైవేటు వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివాసంలో రూ.10 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఈ చర్య చేపట్టినట్లు ఏసీబీ వెల్లడించింది. ఏసీబీ వివరాల ప్రకారం.. ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా సాక్షుల విచారణ జరిగేలా సహకరించి, కేసును నిర్దోషిగా ముగించేందుకు సహాయం చేస్తానని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ మొత్తాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మొత్తాన్ని నేరుగా కాకుండా ప్రైవేటు వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్య ద్వారా తీసుకునేలా వ్యవహరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో పెద్దపల్లిలోని రవీందర్ నివాసంలో రూ.10 వేల నగదును స్వీకరిస్తున్న సమయంలో కరీంనగర్ ఏసీబీ బృందం దాడి చేసి ఇద్దరినీ పట్టుకుంది. లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తిపై లంచం ఆరోపణలు రావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.