మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక
మార్కాపురం: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా రాసి ప్రజా పరిష్కార వేదికలో అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం 1100 నంబర్‌కు ఫోన్ చేసి అర్జీని నమోదు చేసుకోవడంతో పాటు, అర్జీ ప్రస్తుత స్థితిని కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.