BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:57 pm
Posted by : K MAHESH

ప్రజా సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 06:57 PM
15 వీక్షణలు

ఆలేరు గ్రామంలో 31 మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

నెల్లికుదురు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి అన్నారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు సంబంధించి 31 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ జిల్లా నాయకుడు నాయిని సత్యపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ గన్న హరీష్, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డితో కలిసి మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుటుంబ బీమా పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు బీమా, సన్నధాన్యానికి బోనస్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోతరాజు నరేష్, డోనికేని భాగ్యలక్ష్మి, ఆమంద సుగుణమ్మ, షేక్ అక్తర్ గౌస్, దేవాలయ కమిటీ చైర్మన్లు కృష్ణ, సుధాకర్, గ్రామ నాయకులు కాలేరు సూరయ్య, గుదే యుగేందర్, ఆమంద నర్సయ్య, పటేల్ దయాకర్, అజీమ్, తారక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.