BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 22 August 2026, 07:40 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రామసముద్రం–పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Aug, 2026 - 07:40 PM
60 వీక్షణలు

రామసముద్రం - పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం - వ్యక్తికి తీవ్ర గాయాలు

పుంగనూరు మండలం, రామసముద్రం నుండి పుంగనూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రసన్నయ్యగారిపల్లి మూలమలుపు వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో పెద్ద పంజాని మండలం  పెద్దారికుంట గ్రామానికి చెందిన కే.వెంకటరమణ అదుపుతప్పి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనదారుడికి కాలు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అక్కడే ఉన్న స్థానికులు, వాహనదారులు స్పందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది .

ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.