BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 07:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుమ్మరికుంట్ల బ్రిడ్జి వద్ద ఉధృతంగా వరద.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 07:44 PM
73 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏ.కొండూరు–విస్సన్నపేట మధ్య కుమ్మరికుంట్ల బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వరద నీటి ఉధృతి కారణంగా ఏ.కొండూరు–విస్సన్నపేట మధ్య ప్రయాణించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన వారు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.

బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుండటంతో వాహనదారులు అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వరద నీరు తగ్గే వరకు బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించవద్దని స్థానికులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు కొనసాగితే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.