BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 01:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో వర్షబీభత్సం.. బాధితులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే కొలికపూడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 01:26 PM
9 వీక్షణలు

తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు మండలంలో నిన్న సాయంత్రం 3 నుంచి 4 గంటల పాటు వీచిన తీవ్ర ఈదురుగాలులకు చింతలపాడు గ్రామంలో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. భారీ గాలుల ధాటికి దాదాపు 70 విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.

వర్షబీభత్సంతో నష్టపోయిన కుటుంబాలను రాత్రికిరాత్రే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎమ్మెల్యే తెలిపారు. బాధితుల కోసం ప్రభుత్వ పాఠశాలలో రాత్రి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వసతి కల్పించినట్లు చెప్పారు. ఆర్డీవో, ఎంఆర్వో, ఎండీవోతో పాటు తాను కూడా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చింతలపాడు గ్రామాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇంటిని ప్రత్యక్షంగా పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు, పాక్షికంగా నష్టపోయిన ఇళ్లు, ఇతర ఆస్తుల నష్టాన్ని వేర్వేరుగా గుర్తించి తీవ్రత ఆధారంగా వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

నష్టం అంచనా పూర్తయిన వెంటనే అర్హత ఉన్న బాధితులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మరమ్మతులకు కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బందిని రంగంలోకి దించి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వర్షం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.