పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ
పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ
పాకాల:
పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కళాశాల నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, "మాకు న్యాయం కావాలి" అని బిగ్గరగా నినాదాలు చేశారు.
డిగ్రీ విద్యార్థులకు నిబంధనల ప్రకారమే ఉపకార వేతనాలు: కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుజాత
ర్యాలీ మరియు విద్యార్థుల ఆందోళనపై తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుజాత మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విద్యార్థుల స్కాలర్‌షిప్ (ఉపకార వేతనం) డబ్బులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలగాలని, ఎలాంటి అపోహలకు గురికాకూడదని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోరారు.