BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:53 pm
Posted by : కూనురు మధు

లంచం ఆరోపణలపై ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ

తెలంగాణ
/ హైదరాబాద్
05 Oct, 2026 - 09:53 PM
10 వీక్షణలు

NTODAY NEWS : హైదరాబాద్ 

 ఆసుపత్రి అనుమతుల వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ స్వర్ణకుమారి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. ఈ ఘటన వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. ఆసుపత్రికి సంబంధించిన అనుమతుల ప్రక్రియలో భాగంగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిపై చర్యలు చేపట్టినట్లు సమాచారం.

DMHO కార్యాలయంలో సోదాలు

శివరాంపల్లిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రుల అనుమతుల వ్యవహారంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? లంచం వ్యవహారంలో మరెవరైనా పాత్ర ఉందా? అనే కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల ప్రకటన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.