BREAKING
thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం
Date of Publish : 22 August 2026, 07:38 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Aug, 2026 - 07:38 PM
58 వీక్షణలు

మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు: మదనపల్లి నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

పుంగనూరు మండలానికి చెందిన విజయ్ కుమార్ (25) తన ద్విచక్ర వాహనంపై ఒక మహిళతో కలిసి మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తుండగా, భీమగానిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడగా, మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. విజయ్ కుమార్ ఎడమ కాలుకు గాయం కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అనంతరం క్షతగాత్రులను పుంగనూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.