BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం తొలగింపు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించిన మాజీ సర్పంచ్ గూడపాటి కేశవరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 07:42 PM
14 వీక్షణలు

ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీ పరిధిలోని నూతనం, వడ్లపల్లి సెంటర్ సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆడమిల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గూడపాటి కేశవరావు వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వారి సహకారంతో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. తొలగింపు పనులను దగ్గరుండి పర్యవేక్షించి రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వాహనదారులు, గ్రామస్తులకు ఎదురైన ఇబ్బందులు తొలగి ట్రాఫిక్‌ సజావుగా సాగింది. సమస్యపై తక్షణమే స్పందించి రహదారిని క్లియర్ చేయించడంపై వాహనదారులు, గ్రామస్తులు గూడపాటి కేశవరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి మాజీ సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు సంబంధిత అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.