BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 12:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 12:47 PM
15 వీక్షణలు

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కీలక ఆదేశాలు

విజయవాడ, సెప్టెంబర్ 24: ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలోనూ రైన్‌కోట్లు ధరించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించడంతో పాటు కేంద్రాల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేసి, అక్కడ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే పొంగుతున్న కట్టలేరు, మున్నేరు, పాలేరు వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కోతులవాగు, నల్లవాగు, పులివాగు, బుడమేరు పరిస్థితులను జలవనరుల శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. పరిస్థితి చేయిదాటిన తర్వాత చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, ముందస్తు చర్యలపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాగులు, కాలువలు, చెరువుల నీటిమట్టాల్లో మార్పులను గుర్తించిన వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. జగ్గయ్యపేట ఊర చెరువు ప్రాంతాన్ని వెంటనే పరిశీలించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని చెరువులు, వాటి కట్టల స్థితిగతులను పరిశీలించి, ఎక్కడైనా గండ్లు పడే అవకాశం ఉంటే తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విజయవాడ నగరంలో నీరు చేరే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జలహారతి పనులు చేపట్టిన ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే పరిస్థితి ఉందా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ వర్షాల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.