BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
05 Oct, 2026 - 09:59 PM
5 వీక్షణలు

కొండపి: ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు, కె.బిట్రగుంట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు.

నర్సింగోలు గ్రామంలోని శనీశ్వరాలయంలో ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ కల్పన కుమారి తదితరులతో కలిసి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నర్సింగోలు, కె.బిట్రగుంట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సభా ప్రాంగణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో సమన్వయంతో పనిచేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచనలు, సలహాలు అందించారు.