BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 06:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 06:25 PM
9 వీక్షణలు

కామవరపుకోట: అమెరికాలోని ప్రతిష్టాత్మక ది ఒబామా చెస్కీ వాయేజర్ స్కాలర్‌షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్‌కు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన కొర్రపాటి రిత్విక్ ఎంపికయ్యారు. కేఆర్‌ఆర్ బ్రైట్‌మైండ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ కొర్రపాటి సుధాకర్, డాక్టర్ గీత దంపతుల రెండో కుమారుడైన రిత్విక్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా, ఎయిర్‌బీఎన్‌బీ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ చెస్కీ కలిసి ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమంలో అమెరికా వ్యాప్తంగా కేవలం 100 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. రెండేళ్లపాటు కొనసాగే ఈ నాయకత్వ కార్యక్రమం ద్వారా ప్రజాసేవ పట్ల ఆసక్తి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం, నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తారు. అమెరికా వ్యాప్తంగా కళాశాలల్లో రెండో సంవత్సరం పూర్తి చేసి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అనేక మంది విద్యార్థుల్లో కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం లభించడం విశేషం. అందులో కొర్రపాటి రిత్విక్ ఎంపిక కావడం పట్ల తడికలపూడి, కామవరపుకోట మండలంలో హర్షం వ్యక్తమవుతోంది. సమాజ సేవ, ప్రజాహితం, నాయకత్వం వంటి అంశాలపై రిత్విక్‌కు ఉన్న ఆసక్తి, సేవా దృక్పథం ఈ ఎంపికకు దోహదపడినట్లు డాక్టర్ కొర్రపాటి సుధాకర్ తెలిపారు. ప్రతిష్టాత్మక వాయేజర్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన రిత్విక్‌కు కేఆర్‌ఆర్ విద్యాసంస్థల సిబ్బంది, మండలంలోని పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు అభినందనలు తెలిపారు.