BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:41 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

రొంపిచర్ల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Nov, 2026 - 06:41 PM
9 వీక్షణలు

ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో నిర్ణయం.. శుక్రవారం ప్రమాణ స్వీకారం, ఎన్నిక

రొంపిచర్ల, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడింది. మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, గురువారం నిర్వహించిన ఎన్నికల సమావేశానికి సభ్యులు ఎవరూ హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేసినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. శ్రీనివాసులు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం వారిలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్ ఎంపీపీ) ఎన్నుకోనున్నట్లు తెలిపారు.

శుక్రవారం జరిగే సమావేశానికి ఎంపీటీసీ సభ్యులందరూ హాజరై ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కె. శ్రీనివాసులు కోరారు.