డబ్బగుంటపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి
తెలంగాణ
/
జనగామ
/
బచ్చన్నపేట
బచ్చన్నపేట: మండలంలోని డబ్బగుంటపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ చంద్రకళ భర్త కొంతం స్వామి, మాజీ ఉపసర్పంచ్ రాపాక రాజు గ్రామస్తుల సహకారంతో ఆర్టీసీ డీఎం ఉషకు వినతిపత్రం అందించారు.
డబ్బగుంటపల్లి గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తే ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డబ్బగుంటపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీఎం ఉషను కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.