కందుకూరు సీఐగా ఎస్. జగదీష్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
కందుకూరు: కందుకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్. జగదీష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కందుకూరు సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సీఐ ఎస్. జగదీష్‌కు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.