BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 25 September 2026, 12:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Sep, 2026 - 12:21 PM
54 వీక్షణలు

హైదరాబాద్, సెప్టెంబర్ 25: సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIVIPL)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం.

ఈడీ దర్యాప్తులో భాగంగా సాహితి ఇన్‌ఫ్రా నుంచి అరెకపూడి గాంధీ బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.2.1 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మొత్తానికి సంబంధించిన లావాదేవీల స్వభావం, వాటి ఉద్దేశం, నిధుల ప్రవాహంపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఫ్లాట్లు, విల్లాలు అందిస్తామని హామీ ఇచ్చి హోమ్‌బయ్యర్లు, పెట్టుబడిదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మోసం చేసినట్లు ఈడీ దర్యాప్తులో పేర్కొంది. ఈ కేసులో మొత్తం రూ.842.15 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉన్నట్లు ఈడీ తెలిపింది. కంపెనీకి అవసరమైన RERA, HMDA అనుమతులు లేవని, ప్రాజెక్టుకు ఎస్క్రో ఖాతా కూడా ఏర్పాటు చేయలేదని దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

అలాగే హోమ్‌బయ్యర్ల నుంచి రూ.216.91 కోట్లను నగదు రూపంలో సేకరించి లెక్కల్లో చూపలేదని ఈడీ పేర్కొంది. నిధులను వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, సంబంధిత మరియు ఇతర సంస్థలు, వ్యక్తులకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారిక పత్రాల్లో వెల్లడించింది.

ఈ కేసులో ఇప్పటికే రూ.161.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అనంతరం మరో రూ.12.65 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను కూడా అటాచ్ చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది.

దర్యాప్తులో భాగంగా 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. సాహితి ఇన్‌ఫ్రాటెక్ కేసులో సంస్థ మాజీ డైరెక్టర్ సాండు పూర్ణచంద్రరావును ఈడీ 202