BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 08:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంపూర్ణ చంద్రగ్రహణం.. సూతక కాలంలో పాటించాల్సిన నియమాలివే

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 08:46 AM
68 వీక్షణలు

సంపూర్ణ చంద్రగ్రహణం.. సూతక కాలంలో పాటించాల్సిన నియమాలివే

ఆగస్టు 28న ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో సూతక కాలంపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. గ్రహణానికి సుమారు 9 గంటల ముందు నుంచే సూతక కాలం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని ఆచారాలను పాటించాలని సూచిస్తున్నారు.

సూతక కాలం ప్రారంభానికి ముందు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలని సూచించారు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవతా విగ్రహాలను శుద్ధి చేసి దీపారాధన చేయాలని తెలిపారు.

గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలను ఉపయోగించకుండా తొలగించాలని, గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బియ్యం, నువ్వులు, వస్త్రాలు, ధనం వంటి వస్తువులను దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు వెల్లడించారు.

అయితే చంద్రగ్రహణం అనేది ఖగోళ ప్రక్రియ అని, ఇలాంటి ఆచారాలు ప్రధానంగా సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినవని నిపుణులు పేర్కొంటున్నారు.