BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:23 am
Posted by : K MAHESH

గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:23 AM
20 వీక్షణలు

గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు

కేసముద్రం, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండా కొత్తూరు గ్రామ పంచాయతీలో దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామస్థుల మధ్య పండుగ ఆనందాన్ని పంచుకుంటూ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర ఆప్యాయతలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ దీపావళి పర్వదినం పెద్ద మోరి తండా కొత్తూరు గ్రామ ప్రజలతో పాటు కేసముద్రం మున్సిపాలిటీ, మండల ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పెద్ద మోరి తండా కొత్తూరు గ్రామ ప్రజలకు, కేసముద్రం మున్సిపాలిటీ, మండల ప్రజలకు సర్పంచ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామస్థులకు మిఠాయిలు పంపిణీ చేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.