BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:26 am
Posted by : K MAHESH

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సర్పంచ్ లింగ నాయక్

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:26 AM
23 వీక్షణలు

లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని.. పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచన

బయ్యారం, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చేపడుతున్న నిర్మాణ పనులను బయ్యారం మండలం కోయగూడెం గ్రామ సర్పంచ్ లింగ నాయక్ పరిశీలించారు. ఆదివారం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఒక్కో లబ్ధిదారుడి ఇంటి నిర్మాణ స్థితిగతులను పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి ఆరా తీశారు. నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు అవసరమైన అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు.

అనంతరం సర్పంచ్ లింగ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని తెలిపారు.

గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లబ్ధిదారులకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఇతరులు పాల్గొన్నారు.