BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం
Test 4
Date of Publish : 12 November 2026, 06:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పీపీపీ విధానం ముసుగులో మెడికల్‌ కాలేజీల విక్రయం.. ఇది పక్కా స్కామ్‌

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:58 PM
2 వీక్షణలు

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పీపీపీ విధానం వెనుక భారీ అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరాకు కేవలం రూ.100కే లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం ద్వారా సగానికిపైగా వైద్య సీట్లను ప్రైవేటు సంస్థలు తమకు అనుకూలంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు.

వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్‌) పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని జగన్‌ ఆరోపించారు. కళాశాలలకు అవసరమైన భూములు ప్రభుత్వానివేనని, భవనాల నిర్మాణానికి కూడా ప్రభుత్వ నిధులే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. వీజీఎఫ్‌ రూపంలో ఇచ్చే నిధులతోపాటు సిబ్బంది జీతాల భారం కూడా ప్రభుత్వమే భరిస్తున్నప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలన్నీ బోధనాసుపత్రులతో కూడినవేనని జగన్‌ గుర్తుచేశారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు, సగం వైద్య సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటు వైద్య కళాశాలలతో పోలిస్తే తక్కువ ఫీజులకే అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ఈ కళాశాలల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తమ ప్రభుత్వం పటిష్టమైన నమూనాను రూపొందించిందని పేర్కొన్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయం దారుణమని విమర్శించారు.