కోటపాడులో సేవా సంకల్ప అభియాన్
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం: కోటపాడు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఓ. బిల్లనేని ఉదయ రాజేశ్వరరావు, టీడీపీ నాయకుడు బొట్టు రామచంద్రరావు, టీడీపీ సీనియర్ నాయకుడు మందలపు జగదీష్ పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
అలాగే ఎంపీహెచ్‌ఈఓ శ్రీధర్, హెచ్‌వీ సబిత, రాజశేఖర్, ఎమ్మెల్ హెచ్‌పీఎస్ ప్రకాష్, రత్నకుమారి, ఏఎన్‌ఎం జయ ప్రభాకర్, ఎంపీహెచ్‌ఏఎం దార్ల సురేష్‌బాబు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆరోగ్య అవగాహనతో పాటు ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై కార్యక్రమంలో వివరించారు.