BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ సేన కృషి

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:21 PM
18 వీక్షణలు

జోగులాంబ గద్వాల జిల్లాలో సేవాలాల్ సేన సమీక్షా సమావేశం 

తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ సేన కృషి జోగులాంబ గద్వాల జిల్లాలో సేవాలాల్ సేన సమీక్షా సమావేశం ప్రతి తండాకు సంఘం లక్ష్యాలను తీసుకెళ్లాలి: నాయకుల పిలుపు


తెలంగాణ రాష్ట్రంలోని బంజారా సమాజ ఐక్యత, అభ్యున్నతి, హక్కుల సాధనే లక్ష్యంగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో సమీక్షా సమావేశం, మీడియా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం బలోపేతం, సమాజ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణ, బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధన తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు చిన్నబాబు నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోత్ రామ్ బాబు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల లక్పతి నాయక్, రవి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల లక్పతి నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సేన ఆశయాలు, లక్ష్యాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తండాకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బంజారా సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాజం మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన చేపడుతున్న కార్యక్రమాలు, బంజారా సమాజ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యక్రమాల గురించి నాయకులు వివరించారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రంలోని అన్ని తండాల్లో ప్రజలను చైతన్యపరిచేలా కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఎం. రవి నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. రవి నాయక్, సేవాలాల్ సేన జాతీయ నాయకుడు ఎన్. నరసింహ నాయక్, కడ్తాల్ మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, సేవాలాల్ సేన కడ్తాల్ మండల ధర్మకర్త అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా సమాజ ఐక్యత, అభివృద్ధి, హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా సేవాలాల్ సేన నిరంతరం కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని సంఘటిత శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు.