BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 04:06 pm
Posted by : కూనురు మధు

ఏడాది గడిచినా తొలగని శివనేనిగూడెం డంపింగ్‌ యార్డు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Nov, 2026 - 04:06 PM
28 వీక్షణలు


మూడు రోజుల్లో ఎత్తేస్తామన్న హామీ అమలు కాలేదని బీజేపీ నేతల ఆరోపణ 


NTODAY NEWS : చిట్యాల

మున్సిపాలిటీలోని ఒకటో వార్డు శివనేనిగూడెంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌ యార్డును తొలగిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ రుద్రవరం లింగస్వామి ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు డంపింగ్‌ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే మూడు రోజుల్లోనే తొలగిస్తామని హామీ ఇచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. డంపింగ్‌ యార్డును తొలగించకపోగా చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల చెత్తను తీసుకొచ్చి శివనేనిగూడెంలో వేస్తుండటంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సమీపంలోనే డంపింగ్‌ యార్డు ఉండటంతో దుర్వాసన, అపరిశుభ్రత కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిసర ప్రాంత రైతులకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. డంపింగ్‌ యార్డు సమస్యపై గత కొన్నేళ్లుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు ఆందోళనలు నిర్వహించడంతో పాటు జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. చివరకు ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి మూడు రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శివనేనిగూడెం మరో జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొంటూ, వెంటనే డంపింగ్‌ యార్డును తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే గ్రామ ప్రజలను సమీకరించి మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌, గ్రామ యువకులు రుద్రవరం మధు, రుద్రవరం రవీందర్‌, రుద్రవరం నాగరాజు, రుద్రవరం శ్రీకాంత్‌, బోయ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.