BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 04:39 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హోటల్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన SHO రమేశ్ నాయక్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 04:39 PM
10 వీక్షణలు

అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ నిర్వహణకు అనుమతి పేరుతో నెలకు రూ.50 వేల డిమాండ్

పోలీస్ స్టేషన్‌లోనే రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ దాడి.. నాలుగు కవర్లలో రూ.1.85 లక్షల నగదు స్వాధీనం

హోటల్‌ను అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చే విషయంలో SHO ఎల్. రమేశ్ నాయక్ ఓ హోటల్ యజమాని నుంచి నెలకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తొలుత రూ.10 వేలు తీసుకున్న అధికారి, అక్టోబర్ 31న మరో రూ.20 వేలు స్వీకరించినట్లు సమాచారం. తాజాగా మరో రూ.20 వేలు ఇవ్వాలని కోరడంతో హోటల్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, SHOను పట్టుకునేందుకు వల పన్నారు. పోలీస్ స్టేషన్‌లోనే హోటల్ యజమాని నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రమేశ్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా, నాలుగు వేర్వేరు కవర్లలో లెక్కల్లో చూపని రూ.1.85 లక్షల నగదు లభ్యమైనట్లు సమాచారం. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు SHO రమేశ్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.