Tirupati: జనసేన నాయకుడు రాజేష్ ఆచారికి షోకాజ్ నోటీసు
తిరుపతి (ఎన్ టుడే న్యూస్):
తిరుపతికి చెందిన జనసేన నాయకుడు రాజేష్ ఆచారికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇతర నాయకులు, వీర మహిళలపై మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, బహిరంగ విమర్శల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.
ఈ మేరకు రాజేష్ ఆచారికి జారీ చేసిన నోటీసులో 24 గంటల్లోగా తన వివరణను అందజేయాలని స్పష్టం చేసింది. పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరినట్లు పేర్కొంది.
పార్టీ క్రమశిక్షణ, నియమావళిని ప్రతి నాయకుడు తప్పనిసరిగా పాటించాలని నోటీసులో సూచించింది. భవిష్యత్తులో పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాజేష్ ఆచారి ఇచ్చే వివరణ ఆధారంగా పార్టీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.