BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 05:10 pm
Posted by : PAGADALA DEVAIAH

షిరిడీ సాయిబాబా సంస్థానంలో ప్రత్యేక దీపాలంకరణ మహోత్సవం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
06 Nov, 2026 - 05:10 PM
12 వీక్షణలు

హైదరాబాద్, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్):

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీ ఆదివారం షిరిడీ సాయిబాబా సంస్థానంలో ప్రత్యేక దీపాలంకరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ ధనలక్ష్మి పూజ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రతిరోజూ జరిగే సంధ్యా హారతి (ధూప్ హారతి) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఆరోజు సంస్థానంలో విద్యుత్ దీపాలను వినియోగించకుండా సంప్రదాయ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేపట్టి, దీపాల వెలుగుల మధ్య సాయిబాబాకు హారతి సమర్పించనున్నారు.

ఈ ప్రత్యేక దీపాలంకరణ మహోత్సవం రాత్రి 10.30 గంటలకు జరిగే శేజ్ హారతి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ ధనలక్ష్మి అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు, శ్రీ షిరిడీ సాయిబాబా వారి తీర్థప్రసాదాలను అందించనున్నారు.

భక్తులందరూ ఈ ప్రత్యేక దీపాలంకరణ మహోత్సవానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని సంస్థాన నిర్వాహకులు కోరారు.