శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి, సెప్టెంబర్ 25: కనిగిరి–గార్లపేట రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ చిన్న కుమార్తె నిషిత పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి దద్దాల మంజు భార్గవి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య వేద ఆశీర్వచనం అందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
కుటుంబ సభ్యులు నిషిత పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.