BREAKING
thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు
Date of Publish : 05 October 2026, 07:15 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సేవా సేతు అభియాన్‌లో భాగంగా 6, 7, 8 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
05 Oct, 2026 - 07:15 PM
4 వీక్షణలు

కొండపి: సేవా సేతు అభియాన్‌లో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కొండపి మండల సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ జీ. హరిదీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లకు దరఖాస్తుల నమోదు, సోలార్ వెండర్ల ఎంపిక వంటి సేవలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు బ్యాంకు రుణాలు అవసరమైన వినియోగదారుల కోసం బ్యాంకు అధికారులను కూడా కార్యక్రమ ప్రాంగణంలో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

వినియోగదారులు వివిధ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఒకే చోట అవసరమైన సేవలు, సమాచారం అందించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కొండపి మండలంలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ ఇంజినీర్ జీ. హరిదీష్ కోరారు. సోలార్ రూఫ్‌టాప్‌కు సంబంధించిన దరఖాస్తులు, రుణ సదుపాయాలు, వెండర్ల ఎంపికపై అవసరమైన సమాచారాన్ని కార్యక్రమంలో పొందవచ్చని తెలిపారు.