BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పీ-4 కార్యక్రమంతో సేవా రంగంలో ప్రత్యేక గుర్తింపు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:26 PM
20 వీక్షణలు

మంత్రి తనయుడు కొలుసు నితిన్ కృష్ణకు ఘనంగా జన్మదిన వేడుకలు

పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ.. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నితిన్ కృష్ణ తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు.. సొంత నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు

ఏలూరు జిల్లా / నూజివీడు, నవంబర్ 18: రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు, నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ జన్మదిన వేడుకలు నూజివీడులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమంలో భాగస్వామిగా నిలుస్తూ, నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తున్న నితిన్ కృష్ణ సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. నూజివీడులోని చినగాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి. క్యాంపు కార్యాలయ ఉద్యోగులు భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ నితిన్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ-4 కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేయడంలో నితిన్ కృష్ణ ప్రత్యేక చొరవ చూపుతున్నారని ప్రశంసించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకుని, అవసరమైన వారికి అండగా నిలవాలనే సంకల్పంతో నితిన్ కృష్ణ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పలు గ్రామాలు, నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బంగారు తల్లి కుటుంబాలకు అండగా నిలవడం, జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులకు తోపుడు బండ్లు అందించడం, పాడి పశువులను పంపిణీ చేసి గ్రామీణ కుటుంబాలకు ఆదాయ మార్గాలు కల్పించడం, దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా నింపుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆ కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించడం పీ-4 కార్యక్రమం స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, నూజివీడు నియోజకవర్గం పీ-4 అమలులో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఉంటూ, అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలిచే సేవా దృక్పథం నితిన్ కృష్ణకు మరింత గుర్తింపు తీసుకొస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతూ సేవా రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూజివీడు నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వర్చువల్‌గా కృతజ్ఞతలు తెలిపిన నితిన్ కృష్ణ ఈ సందర్భంగా కొలుసు నితిన్ కృష్ణ వర్చువల్‌గా మాట్లాడుతూ తనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, క్యాంపు కార్యాలయ ఉద్యోగులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తనపై చూపించిన ఆప్యాయత, అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఇస్తానని, తన తండ్రి కొలుసు పార్థసారథి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు, యువతకు అందుబాటులో ఉంటూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా, ఏ కుటుంబానికైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత త్వరగా స్పందించి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులే తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నాయని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తన కుటుంబంపై చూపిస్తున్న అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని నితిన్ కృష్ణ తెలిపారు.