మూడోసారి ఓవరాల్ ఛాంపియన్స్‌గా శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్
SGF మధిర మండల స్థాయి క్రీడల్లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్స్‌గా శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్
మధిర, ఖమ్మం జిల్లా: టీవీఎం స్కూల్‌లో నిర్వహించిన SGF మధిర మండల స్థాయి క్రీడా పోటీల్లో శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించారు.
క్రీడా పోటీల్లో సీనియర్ బాలికల కబడ్డీ, జూనియర్ బాలికల కబడ్డీ, జూనియర్ బాలుర కబడ్డీ విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించారు. సీనియర్ బాలుర వాలీబాల్ విభాగంలో జాయింట్ విన్నర్స్‌గా నిలిచారు. అలాగే సీనియర్ బాలికల వాలీబాల్, సీనియర్ బాలికల ఖో-ఖో, జూనియర్ బాలుర ఖో-ఖో విభాగాల్లో ద్వితీయ బహుమతులు సాధించారు. మొత్తం ఏడు విభాగాల్లో బహుమతులు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బి. అంజన బాబు, డైరెక్టర్ చందు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా పాఠశాలలో సముచిత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు సాధిస్తున్న వరుస విజయాలు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడా సిబ్బంది చేస్తున్న కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందిస్తున్న పి.డి. ప్రవీణ్, పి.ఈ.టి. శివను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిన విజేత క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.