ఉరుమడ్లలో గుత్తా సుఖేందర్ రెడ్డికి శ్రీశైలం ప్రసాదం అందజేత
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
ఉరుమడ్ల, సెప్టెంబర్ 25: ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.
గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, వార్డు సభ్యులు ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి, రూపని యాదయ్య, నడిమిపల్లి గోపాల్, సుంకరి క్రాంతి తదితరులు గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించినట్లు తెలిపారు.