BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:15 PM
19 వీక్షణలు

ఒకే చోటు నుంచి జిల్లా అంతటా నిఘా.. ఏకకాలంలో 30 డ్రోన్ల ప్రత్యక్ష ప్రసారాల పర్యవేక్షణ ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్‌తో నేరస్తుల గుర్తింపు.. అన్ని జిల్లాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కృష్ణాజిల్లా: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కృష్ణాజిల్లా పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నేర నియంత్రణ, నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ట్రైనీ ఐఏఎస్ నమ్రత అగర్వాల్ తదితరులు హాజరయ్యారు. తొలుత డీజీపీకి వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి గౌరవ వందనం సమర్పించారు. డీజీపీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన డీజీపీ, అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల పనితీరును జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తెరలపై ప్రత్యక్ష ప్రసారాలను పరిశీలించి, కెమెరాల అనుసంధానం, డ్రోన్ పర్యవేక్షణ, కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను నమోదు చేసి కేంద్రం ఏర్పాటుపై అభినందనలు తెలిపారు. నేర నియంత్రణలో సాంకేతిక విప్లవం ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యాధునిక సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ కేంద్రం పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా నేరాల ఛేదన, అనుమానితుల గుర్తింపు, ప్రజా భద్రత పర్యవేక్షణ మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఒకేసారి 30 డ్రోన్ కెమెరాల ప్రత్యక్ష ప్రసారాలను పరిశీలించే సాంకేతిక సామర్థ్యం ఉండటం విశేషమన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అందే సమాచారాన్ని ఒకే చోటు నుంచి పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన సూచనలు అందించవచ్చని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కరించారా లేదా అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పారదర్శకతకు నిదర్శనమన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించే చర్యలు చేపడతామని వెల్లడించారు. 30 డ్రోన్ల ప్రత్యక్ష ప్రసారాలు.. జిల్లా మొత్తం ఒకే తెరపై ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సీసీ కెమెరాలతో పాటు ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు, ఇతర సంస్థల కెమెరాలను కూడా అనుసంధానం చేశారు. ఒకే కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఒకేసారి 30 డ్రోన్ కెమెరాల ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరించి పరిశీలించే సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రమాదాలు, అత్యవసర ఘటనలు, భారీ కార్యక్రమాలు, శాంతిభద్రతలకు సంబంధించిన పరిస్థితులను తక్షణమే అంచనా వేసి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయవచ్చు. ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్‌తో నేరస్తుల గుర్తింపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, సీసీటీవీ 360 ప్రాజెక్టు వంటి ఆధునిక విధానాలను వినియోగించి నేరాలకు పాల్పడిన అనుమానితులను గుర్తించడం, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవడం, దొంగతనానికి గురైన వాహనాలను గుర్తించడం వంటి పనులను వేగవంతం చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వాహనాల గుర్తింపునకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అనుసంధానమైన కెమెరాల సమాచారాన్ని ఒకే కేంద్రం నుంచి పరిశీలించే వెసులుబాటు కలగడంతో దర్యాప్తులో జాప్యం తగ్గనుంది. డయల్ 112తో అనుసంధానం.. అత్యవసర సమయాల్లో వేగవంతమైన స్పందన ప్రజల నుంచి వచ్చే అత్యవసర సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు చేరవేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను డయల్ 112 వ్యవస్థతో అనుసంధానం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. లైవ్ అలర్ట్స్ ద్వారా సంఘటనలపై తక్షణ సమాచారం అందుబాటులోకి రానుంది. ఫిర్యాదుల పరిష్కారంపై ఎస్పీకి నేరుగా సమాచారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌ (మీకోసం) ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. కొత్తగా వచ్చిన ఫిర్యాదులతో పాటు పరిష్కరించి ముగించిన ఫిర్యాదులపై కూడా అభిప్రాయాలను సేకరించి నేరుగా ఎస్పీకి చేరేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారంలో లోపాలు ఉంటే గుర్తించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేక నిఘా గృహ దొంగతనాల నివారణకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) కెమెరాలను కూడా ఈ కేంద్రానికి అనుసంధానం చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద అనుమానాస్పద కదలికలను పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. అలాగే ఏఐ ఆధారిత త్రినేత్ర లైవ్ మానిటరింగ్ యాప్‌ను కూడా అనుసంధానం చేశారు. బందోబస్తు విధుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు ఎన్నికలు, ముఖ్యమైన కార్యక్రమాలు, భారీ బందోబస్తులు, ఇతర శాంతిభద్రతల విధుల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు జారీ చేసే అవకాశం కల్పించారు. విజయవాడ కంట్రోల్ రూమ్‌పై ఆధారపడే పరిస్థితికి స్వస్తి ఇప్పటివరకు కృష్ణాజిల్లాలో ఇలాంటి సమగ్ర ఆధునిక కంట్రోల్ రూమ్ అందుబాటులో లేకపోవడంతో పలు సందర్భాల్లో విజయవాడ కంట్రోల్ రూమ్‌పై ఆధారపడాల్సి వచ్చేది. దీనివల్ల నేర పరిశోధన, సమాచారం సేకరణలో కొంత జాప్యం జరిగేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో పోలీస్ శాఖ స్వతంత్రంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది. హైఎండ్ కంప్యూటర్లు, అత్యాధునిక డిస్‌ప్లే తెరలు, సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేకత ఏమిటంటే జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్వయంగా ఈ కంట్రోల్ రూమ్ రూపకల్పనతో పాటు సాంకేతిక అంశాల రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక కమాండ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు జిల్లాలోని వివిధ పరిశ్రమలు, దాతలు కూడా పలు పరికరాలను అందించి సహకరించారని పేర్కొన్నారు. వారికి పోలీస్ శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. కేవలం సీసీ కెమెరాల పర్యవేక్షణకే పరిమితం కాకుండా నేర నియంత్రణ, నేర పరిశోధన, అత్యవసర సేవలు, శాంతిభద్రతల నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.