BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సంఘ్ పరివార్, గాంధీ పరివార్ మధ్య పోరాటం: సీఎం రేవంత్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
25 Sep, 2026 - 08:21 PM
11 వీక్షణలు

నిలంబూర్, సెప్టెంబర్ 25: దేశంలో సంఘ్ పరివార్, గాంధీ పరివార్ మధ్య పోరాటం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం తదితర అంశాల ఆధారంగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు గాంధీ పరివార్ దేశం కోసం త్యాగాలు చేసిందని ఆయన పేర్కొన్నారు.


దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించేందుకు గాంధీ పరివార్ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఆర్యదాన్ ముహమ్మద్ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ప్రజా సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆయన స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


కాగా, ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందించే ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డుకు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.